Monday 13th of May 2024

అరచేతిలో ‘ఆరోగ్యశ్రీ’

13 Dec , 2023 11:55 , IST
Article Image

విద్య, వైద్యం అందించడం తన తొలి ప్రాధాన్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరచూ చెబుతూంటారు. ఆ మాటను చేతల్లో కూడా చూపిస్తున్నారు. అందుకనుగుణంగా వైద్య, ఆరోగ్య శాఖపై మునుపెన్నడూ లేనంతగా ఫోకస్‌ పెట్టారు. ప్రభుత్వాసుపత్రులను అభివృద్ధి చేయడంతో పాటు, కొత్త పీహెచ్‌సీలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల ఏర్పాటుతో పాటు వినూత్నంగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ వంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికీ డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ఆపద్బంధువుగా నిలుస్తోంది. ఈ పథకంలో గతంలో 1,059 ప్రొసీజర్లు (చికిత్సా విధానాలు) మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్యను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 3,257కు పెంచింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ప్రత్యేకంగా యాప్‌ను కూడా ప్రభుత్వం రూపొందించింది. ఈ పథకాన్ని సామాన్యుడి అరచేతిలో అందుబాటులో ఉంచేలా ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. గ్రామ/వార్డు వలంటీర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి, ఆరోగ్యశ్రీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. యాప్‌ డౌన్‌లోడ్‌తో పాటు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందుతున్న సేవలన్నింటినీ క్షుణ్ణంగా వివరించేలా ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభించారు. ఈ నెల 1న ప్రారంభమైన ఈ కార్యక్రమం 31వ తేదీ వరకూ కొనసాగుతుంది.ఆరోగ్యశ్రీ యాప్‌ ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఈ పథకం సేవల పరిధి ఏ మేరకు ఉంది, ఏయే వ్యాధులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించుకోవచ్చు, నెట్‌వర్క్‌ ఆసుపత్రులు తదితర వివరాలను ప్రతి ఒక్కరూ తమ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకోవచ్చు. ఎవరైనా ప్రమాదాలకు గురైనా, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నా.. యాప్‌ ఉంటే ఎవరి ప్రమేయమూ లేకుండానే యాప్‌ ద్వారా కావాల్సిన సమాచారం తెలుసుకునే వీలుంటుంది. ఆరోగ్యశ్రీ సేవలపై అవగాహన లేని వారికి సైతం పూర్తి స్థాయిలో అర్థమయ్యేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఇప్పటి వరకూ కార్డుదారు, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యశ్రీ కింద పొందిన చికిత్సల వివరాలు కూడా పొందవచ్చు. చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో కార్డుదారు ఖాతాలో జమయ్యే వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ఆర్థిక సహాయం మొత్తాన్ని కూడా కేసుల వారీగా తెలుసుకునే వీలుంది. చికిత్స సమయంలో కార్డుదారు పొందిన వైద్య పరీక్షల రిపోర్టులు కూడా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంది. అలాగే, ఉచితంగా చికిత్స అందించిన నెట్‌వర్క్‌ ఆసుపత్రికి డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం జమ చేసిన మొత్తం, ఇతర వివరాలను తెలుసుకునే వీలుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో దాదాపు 16 లక్షల మంది ఆరోగ్యశ్రీ కార్డుదారులున్నారు. వీరిలో ఇప్పటి వరకూ 3,28,772 మంది ఆరోగ్యశ్రీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.ఆరోగ్యశ్రీ యాప్‌ ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఈ పథకం సేవల పరిధి ఏ మేరకు ఉంది, ఏయే వ్యాధులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించుకోవచ్చు, నెట్‌వర్క్‌ ఆసుపత్రులు తదితర వివరాలను ప్రతి ఒక్కరూ తమ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకోవచ్చు. ఎవరైనా ప్రమాదాలకు గురైనా, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నా.. యాప్‌ ఉంటే ఎవరి ప్రమేయమూ లేకుండానే యాప్‌ ద్వారా కావాల్సిన సమాచారం తెలుసుకునే వీలుంటుంది. ఆరోగ్యశ్రీ సేవలపై అవగాహన లేని వారికి సైతం పూర్తి స్థాయిలో అర్థమయ్యేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఇప్పటి వరకూ కార్డుదారు, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యశ్రీ కింద పొందిన చికిత్సల వివరాలు కూడా పొందవచ్చు. చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో కార్డుదారు ఖాతాలో జమయ్యే వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ఆర్థిక సహాయం మొత్తాన్ని కూడా కేసుల వారీగా తెలుసుకునే వీలుంది. చికిత్స సమయంలో కార్డుదారు పొందిన వైద్య పరీక్షల రిపోర్టులు కూడా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంది. అలాగే, ఉచితంగా చికిత్స అందించిన నెట్‌వర్క్‌ ఆసుపత్రికి డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం జమ చేసిన మొత్తం, ఇతర వివరాలను తెలుసుకునే వీలుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో దాదాపు 16 లక్షల మంది ఆరోగ్యశ్రీ కార్డుదారులున్నారు. వీరిలో ఇప్పటి వరకూ 3,28,772 మంది ఆరోగ్యశ్రీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు..