Friday 23rd of February 2024

'ఆటా' ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో RO ప్లాంట్ ప్రారంభం

19 Dec , 2023 01:18 , IST
Article Image

ఆటా వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా ఇందుర్తి జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ఆర్వో(RO)ప్లాంట్‌ను ప్రారంభించారు.ఆటా సహకారంతో సుమారు 3 లక్షల రూపాయల నిధులతో స్కూల్ వేదికకు రేకుల షెడ్డు, పిల్లల కోసం తాగడానికి RO వాటర్ ప్లాంట్ నిర్మాణం, కంప్యూటర్, స్పోర్ట్స్ కిట్స్, స్కూల్ బ్యాగ్స్ అందించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కాశీ కొత్త మాట్లాడుతూ..తనను ఈ స్థాయిలో నిలబెట్టిన భారతదేశానికి ఎంత చేసినా తక్కువేనని అన్నారు. ఇక ఈ ​కార్యక్రమంలో ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కాశీ కొత్త కుటుంబసభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, జడ్పీహెచ్‌ఎస్‌ ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు..