Sunday 16th of June 2024

ఈ రాశివారికి ఈ వారంలో తిరుగులేదు, గుడ్‌ న్యూస్‌ వింటారు.

19 Dec , 2023 12:29 , IST
Article Image

మేషం: పనులు సజావుగా పూర్తికాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. అందరిలోనూ మీ ప్రతిభాపాటవాలను చాటుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వివాదాలు సునాయాసంగా పరిష్కారమవుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. వృషభం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో విజయాలు సాధిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుని గుర్తింపు పొందుతారు. కళాకారులకు ఊహించని అవకాశాలు రావచ్చు.  వారం మధ్యలో దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. తెలుపు, నేరేడు రంగులు. శివాష్టకం పఠించండి. మిథునం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు తప్పవు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. సోదరులు, మిత్రులతో లేనిపోని వివాదాలు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయవర్గాలకు నిరుత్సాహమే. నిరుద్యోగుల యత్నాలు కొంతవరకూ సఫలం. వారం మధ్యలో పరిచయాలు పెరుగుతాయి.  శుభవార్తలు. ధన,వస్తులాభాలు. ఆకుపచ్చ, పసుపు రంగులు. అంగారక స్తోత్రం పఠించండి.  కర్కాటకం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. మిత్రులు, బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సఫలం. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఊరట కలిగించే ప్రకటన రావచ్చు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. కళారంగం వారికి నూతనోత్సాహం, సన్మానయోగం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. గులాబీ, ఎరుపు రంగులు. శ్రీగణేశ్‌ స్తోత్రాలు పఠించండి. సింహం: ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుండి శుభవర్తమానాలు అందుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలులో చిక్కులు తొలగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం. కొన్ని కీలక సమావేశాలకు హాజరవుతారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. విద్యార్థులకు కొత్త ఆశలు రేకెత్తుతాయి. వ్యాపార లావాదేవీలు పుంజుకుని లాభపడతారు. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత పెరుగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు ఫలిస్తాయి.  వారం ప్రారంభంలో శుభవార్తలు. ధనలాభం. ఆకుపచ్చ, పసుపు రంగులు. శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి.  కన్య: నూతన వ్యక్తుల పరిచయం. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో విభేదాలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. విద్యార్థులకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో రుణయత్నాలు. దూరప్రయాణాలు. తెలుపు, నేరేడు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. తుల: ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కార్యదీక్షాపరులై విజయాలు సాధిస్తారు. సంఘంలో ఎనలేని గౌరవం పొందుతారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ధనలాభం. ఆస్తి వివాదాలు తీరి లాభం చేకూరుతుంది. వాహనయోగం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. కొందరికి ప్రమోషన్లు సైతం లభిస్తాయి. కళాకారులకు పురస్కారాలు. వారం  మధ్యలో దూరప్రయాణాలు. అనారోగ్యం. వృశ్చికం: దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా  ఉంటుంది. సమస్యల నుంచి బయటపడి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వివాహయత్నాలు సానుకూలం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికరంగం వారికి ఉత్సాహవంతమైన కాలం. విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. మానసిక ఆందోళన. గులాబీ, పసుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు మరింతగా పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహన, కుటుంబసౌఖ్యం. జీవితాశయం నెరవేరుతుంది. సోదరులతో వివాదాలు తీరతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవులు లభించవచ్చు. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. ఎరుపు, తెలుపు రంగులు. శ్రీలక్ష్మీస్తుతి చేయండి. మకరం: అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఒక సమస్య తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యపరంగా చికాకులు తొలగుతాయి. బంధువులు, మిత్రుల సలహాలు పొందుతారు. భూములు, వాహనాలు కొంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళారంగం వారికి సన్మానాలు, పురస్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. నలుపు, నేరేడు రంగులు. ఆంజనేయ దండకం పఠనం మంచిది. కుంభం: ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు అధిగమించి లబ్ది చేకూరుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తులు మరింత దగ్గరవుతారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఎంతటి వారినైనా వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో మరింత లాభపడతారు. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు కలుగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. నీలం, ఆకుపచ్చ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. మీనం: దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. సేవాకార్యక్రమాలలో  పాల్గొంటారు. పాతబాకీలు సైతం వసూలై అవసరాలు తీరతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారవచ్చు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. పారిశ్రామికరంగం వారు ఆశించిన ప్రగతి సాధిస్తారు. వారం చివరిలో అనారోగ్యం. ప్రయాణాలలో ఆటంకాలు. పసుపు, ఎరుపు రంగులు. విష్ణుధ్యానం చేయండి..