Tuesday 14th of May 2024

ఎల్లో బ్యాచ్‌ కొత్త ప్లాన్‌.. భారీ సంఖ్యలో బోగస్‌ ఓట్లు!

13 Dec , 2023 12:23 , IST
Article Image

"టీడీపీ సానుభూతిపరులు.. పలు చోట్ల ఓటర్లుగా నమోదు". "కుప్పం సహా 175 నియోజకవర్గాల్లో 40.76 లక్షలకు పైగా బోగస్‌ ఓట్లు". "కుప్పలు తెప్పలుగా ఫారం 7 దరఖాస్తులు.. విచారణ జరిపి ఆ దరఖాస్తులన్నీ నకిలీవని తేలుస్తున్న బీఎల్వోలు". "కలెక్టర్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు". "2014 ఓటర్ల జాబితాలో సుమారు 35 లక్షలకుపైగా దొంగ ఓట్లు". "40,76,580కిపైగా దొంగ ఓట్ల". నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రి జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసం కోల్పోయిన విపక్షం అడ్డదారులు పడుతోంది! రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల దొంగలు స్వైర విహారం చేస్తున్నారు! అధికార పార్టీ చేపట్టిన సామాజిక సాధికారయాత్ర, ఏపీకి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో వైఎస్సార్‌సీపీని ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జనసేనతో చేతులు కలిపినా ఫలితం శూన్యమని గుర్తించారు.పొత్తుపై అధికారిక ప్రకటన తర్వాత పవన్‌ పర్యటనలు – లోకేశ్‌ పాదయాత్రకు స్పందన లేకపోవడమే దీనికి తార్కాణం. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న టీడీపీ పెద్దలు 2019 ఎన్నికలకు మించి మరోసారి ఘోర పరాజయం తప్పదని పసిగట్టి దొడ్డిదారి పట్టారు! తమకు మాత్రమే సాధ్యమైన వ్యవస్థలోకి వైరస్‌లా చొరబడి చాపకింద నీరులా ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లను చేర్పిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అక్టోబర్‌ 27న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లో 4,02,21,450 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో సుమారు 40,76,580కిపైగా దొంగ ఓట్లను టీడీపీ నేతలు చేర్పించినట్లు ప్రజాసంఘాలు, రాజకీయ పరిశీలకులు గుర్తించారు. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను పలు నియోజకవర్గాల్లో ఒకే ఫోటోతో ఇంటి పేర్లు మార్చి జాబితాలో చేర్పించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న తమ పార్టీ సానుభూతిపరుల పేర్లను సైతం రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో చేర్పించారు..