Tuesday 14th of May 2024

సింగరేణి ‘చేతి’కి చిక్కేనా..!

13 Dec , 2023 04:27 , IST
Article Image

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఈసారైనా గెలువాలని ఐఎన్టీయూసీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ అ ధికారంలో ఉండడం అనుబంధ సంఘమైన సింగరేణి కోల్‌మైన్స్‌ లేబర్‌ యూనియన్‌(ఐఎన్టీయూసీ)కి కలిసి వచ్చే అంశంగా నాయకత్వం భావిస్తోంది. గత 25ఏళ్ల గుర్తింపు సంఘ కాలంలో ఒక్క పర్యాయమే ఐఎన్టీయూసీ అధికారం ద క్కించుకుంది. ఇప్పటివరకు ఆరుసార్లు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. 2003లో మూడో దఫా ఎన్నికల్లో మాత్రమే గుర్తింపు సంఘంగా గెలిచింది. ఆ తర్వాత అధికారం కోల్పోయి 16ఏళ్లుగా ప్రతిపక్ష స్థానంలో ఉండి క్యాడర్‌ను కాపాడుకోవడానికి అపసోపాలు పడింది.అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నెల రోజుల్లోనే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు రావడం కాంగ్రెస్‌ పార్టీ కి బలపరీక్షగా మారింది. సింగరేని విస్తరించిన ఆరు జిల్లాల పరిధిలోని 11అసెంబ్లీ స్థానాల్లో కార్మిక ఓట ర్లు ప్రభావితం చేస్తారు. ఇటీవల ఒక్క ఆసిఫాబాద్‌(బీఆర్‌ఎస్‌) మినహా మిగతా పది చోట్ల కాంగెస్‌ పార్టీ గెలుపొందింది. ప్రస్తుతం వీటి పరిధిలోని 11 ఏరియాల్లో గుర్తింపు సంఘం ఎన్నికల్లో అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీని గెలిపించుకోవాల్సి న బాధ్యత కాంగ్రెస్‌ నాయకత్వంపై పడింది. ఈ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే ప్రతిపక్షాలకు ఆయుధమవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణిలో మరో సంఘం అధికారంలో ఉంటే రాబోయే ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్న పార్టీ.. గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించడానికి నాయకత్వం సిద్ధమైనట్లు తెలిసింది.ఈ నెల 14నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాల తర్వాత ఎక్కడి ఎమ్మెల్యేలు అక్కడే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఐఎ న్టీయూసీ సెక్రెటరీ జనరల్‌ బి.జనక్‌ప్రసాద్‌ తెలిపా రు. ఈ నెల 20న శ్రీరాంపూర్‌లో జరిగే సమావేశానికి ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు బీ.సంజీవరెడ్డి రానున్నారు. ఈ సమావేశంలో కోల్‌బెల్ట్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొననున్నారు. కాగా, ఇప్పటికే గోదావరిఖనిలో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్‌, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణరావు గేట్‌మీటింగ్‌లతో ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అయ్యారు. ఇటీవల శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరిఖనికి వచ్చిన రాహుల్‌గాంధీ ఇక్కడి కార్మికులతో సుమా రు 40 నిమిషాలపాటు ప్రత్యేకంగా మాట్లాడి పార్టీ అండ యూనియన్‌కు ఉంటుందనే సంకేతాలు ఇ చ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా గెలిచిన త ర్వాత సింగరేణి కార్మికులంతా కాంగ్రెస్‌కు పట్టం కట్టారంటూ కొనియాడడంతో మరింత బలాన్నిచ్చింది..