Tuesday 14th of May 2024

మత్స్యశాఖ రూటే వేరు

13 Dec , 2023 04:30 , IST
Article Image

జిల్లాలో మత్స్య శాఖ రూటే సపరేటుఅ న్నట్లు సాగుతోంది. శాఖ అధికారులపై నిత్యం అవి నీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2018లో పనిచేసిన మత్స్యశాఖ అధికారిని మత్స్యకారుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వి షయం తెలిసిందే. ఆయన స్థానంలో వచ్చిన అధి కారి కూడా లంచాలు అడుగుతున్నారని మత్స్యకా ర్మికులు బహిరంగగానే ఆరోపిస్తున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో సంబంధిత అధికారి మెడలో డబ్బుల దండ వేసేందుకు ప్రయత్నించి నిరసన తెలపడం ఆయన పనితీరుకు అద్దం పడుతోంది. మత్స్యశాఖ సొసైటీలో సభ్యులుగా చేరాలన్నా.. ప్రభుత్వ పథకాలు అందాలన్నా లంచాలు ఇవ్వాల్సి వస్తోందంటున్నారు కార్మికులు.సొసైటీలో సభ్యత్వం కావాలంటే మత్స్యకారులకు స్కిల్‌టెస్ట్‌ నిర్వహిస్తుంటారు. వల ఎలా వేయాలి..? తెప్ప ఎలా నడపాలి..? ఈత కొడతారా..? లేదా..? అధికారుల సమక్షంలో చూసిన అనంతరం సంబంధిత ఫిషరీస్‌ డిపార్ట్‌మెంట్‌కు పంపిస్తారు. వారు పరిశీలించి సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. ఇక్కడే తిరకాసు ఉంది. ఈ ప్రొసిడింగ్‌ కాపీలు అందించే సమయంలో డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 239 సొసైటీలున్నాయి. ఇందులో 40 మహిళ, 199 పురుష సొసైటీలు ఉన్నాయి. మహిళలు చేపలు అమ్మేందుకు అనుమతి తీసుకోవాలి. అయితే డబ్బులుంటేనే అనుమతి ఇస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం మత్స్యకారులకు అందించే వాహనాలకూ లంచాలు తీసుకుని ఇస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.2వేల నుంచి రూ.3వేల వరకు డిమాండ్‌ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గోదావరిలో చేపలు పట్టేందుకు గంగపుత్రులు ఏటా లైసెన్స్‌లు రెన్యూవల్‌ చేసుకోవాలి. సొసైటీ సభ్యత్వం కావాలన్నా.. ఇటు లైసెన్స్‌ రెన్యువల్‌ కావాలన్నా.. సంక్షేమ పథకాలు పొందాలన్నా అధికారుల తీరుతో కార్మికులకు తలనొప్పిగా మారింది. గతంలో వెహికిల్స్‌ పంపకాల విషయంలో డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని కొందరు ఏసీబీని ఆశ్రయించగా అప్పటి అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న అధికారి జిల్లాలోని మంగేళ నూతన సొసైటీ గురించి ఒబులాపూర్‌, కల్వకోట, బీమారం, బొమ్మెన, వెల్గటూర్‌ సొసైటీ విషయంపై కొద్దిరోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సదరు అధికారి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని, కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని మత్స్యకార్మికులు ఆరోపిస్తున్నారు. చేసేది లేక సోమవారం జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు సదరు అధికారి మెడలో నోట్ల దండ వేసేందుకు యత్నించాడు. .