Tuesday 14th of May 2024

దరఖాస్తు చేసుకోండి

13 Dec , 2023 05:52 , IST
Article Image

నూతనంగా వ్యవసాయ పట్టాపాస్‌ బుక్‌లు పొందిన రైతులు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలని మద్దూరు ఏఈఓ రాకేశ్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతనంగా వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకొని పట్టాదారు పాసుబుక్‌ పొందిన రైతులు స్థానిక రైతు వేదికలలో వ్యవసాయ విస్తరణ అధికారి వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతుబంధు దరఖాస్తుదారులు ఆధార్‌ కార్డు, పట్టాదారు పాస్‌ బుక్‌, బ్యాంక్‌ అకౌంట్‌, దరఖాస్తు ఫారం నింపి ఏఈఓలకు అందించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ అవుతుందన్నారు.రంజోల్‌ రైతువేదికలో మంగళవారం కేవీకే–డీడీఎస్‌ సంస్థ శాస్త్రవేత్తలు ఆలు సాగులో యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆలుకు సోకే తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు సస్యరక్షణ చర్యల గురించి శాస్త్రవేత్త స్నేహలత వివరించారు. అనంతరం రైతులతో కలిసి ఆలు పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మహీంద్ర అండ్‌ మహీంద్ర కర్మాగారం సహకారంతో బైప్‌ స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న వాటర్‌షెడ్‌ కార్యక్రమాల గురించి ప్రాజెక్టు మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ వివరించారు. వాటర్‌షెడ్‌లో భాగంగా చేపట్టే పర్కులేషన్‌ ట్యాంక్‌, చెక్‌ డ్యాంలు, బోర్వెల్‌ రీచార్జి, ఫాం పాండ్స్‌ తదితర విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈఓ ప్రదీప్‌ కుమార్‌, రైతులు పాల్గొన్నారు..