Monday 13th of May 2024

కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే నాగరాజు

13 Dec , 2023 06:09 , IST
Article Image

వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన కేఆర్‌ నాగరాజు మంగళవారం వరంగల్‌, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్‌, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝాతోపాటు, అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకాడె ను కలిశారు. పూల మొక్క అందజేశారు. ఈసందర్భంగా వారు నాగరాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు.డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం 229 స్టడీ సెంటర్‌ నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు సెకండ్‌, థర్డ్‌ ఇయర్‌, అడ్మిషన్‌ ఫీజు చెల్లించడానికి ఈనెల 31వ తేదీ వరకు గడువు ఉందని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మల్లం నవీన్‌, కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ జె.లకన్‌సింగ్‌లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కో ఆర్డినేటర్‌ లకన్‌సింగ్‌ మాట్లాడుతూ విద్యార్థులు చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వివరాలకు అధ్యయన కేంద్రం హెల్ప్‌ లైన్‌ సెంటర్‌ 73829 29577 నంబర్‌లో సంపద్రించాలని తెలిపారు.మండలంలోని జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీ మరియపురం సర్పంచ్‌ అల్లం బాలిరెడ్డి వరంగల్‌, కాజీపేట నగరాల్లో ని పలు ఆశ్రమాల్లో సుమారు 171 మంది వృద్ధులు, దివ్యాంగులు, బాలలకు మంగళవారం సొంత ఖర్చుతో ఉచితంగా దుప్పట్లను పంపి ణీ చేశారు. వరంగల్‌ నగరంలోని మదర్‌థెరిస్సా హోం లో మానసిక దివ్యాంగులు, కాజీ పేటలోని హౌస్‌ ఆఫ్‌ జాయ్‌లో వృద్ధులు, ఫాతి మానగర్‌లోని సెంట్‌ ఆన్స్‌ హోం ఫర్‌ ఏజ్‌డ్‌ ఫ ర్‌ డిజేబుల్డ్‌ సంస్థలో వృద్ధమహిళలు, దివ్యాంగులకు దుప్పట్లను అందించారు. మరియపురం చర్చి ఫాదర్‌ రాజు, ఆశ్రమాల నిర్వాహకులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా.. మరియపురం గ్రామానికి చెందిన నిర్మలామేరి ఈకార్యక్రమంలో తన జన్మదినం సందర్బంగా దివ్యాంగులైన బాలలకు కేక్‌లు పంపిణీ చేశారు..