Monday 13th of May 2024

గోసపడుతున్నా ‘గుర్తింపు’ లేదు

13 Dec , 2023 07:19 , IST
Article Image

‘సింగరేణి సంస్థలోని వివిధ విభా గాల్లో దశాబ్దాలుగా పనిచేస్తున్నా మా గోస పట్టించుకునేవారే కరువయ్యారు.. అనేక సమస్యలతో సతమతమవుతున్నాం.. పర్మినెంట్‌ కార్మికులతో స మానంగా పనిచేస్తున్నాం.. అయినా అన్నింటా అ న్యాయమమే జరుగుతోంది.. మాకంటూ ఓ సంఘం ఉంటే మా బాధలు కూడా తీరుతాయి’ అంటున్నారు కాంట్రాక్టు కార్మికులు. సింగరేణి సంస్థ వ్యాప్తంగా ఉన్న 11ఏరియాల్లో కాంట్రాక్టు కార్మికులు సుమారు 25 వేల మందికిపైగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. సింగరేణిలో పర్మినెంట్‌ కార్మికులు సుమారు 39వేల మంది ఉండగా వారికోసం గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్న కార్మికశాఖ.. కాంట్రాక్టు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించలేకపోతోంది.సింగరేణి బొగ్గు గనుల సంస్థలో కీలక విభాగాలైన సివిల్‌, సివిక్‌, బెల్ట్‌క్లీనింగ్‌, భవనాల నిర్వహణ, కన్వేయన్స్‌ వాహనాల డ్రైవర్లు, సేల్‌ పిక్కింగ్‌, తోట మాలి, స్కావెంజర్‌ తదితర పనలతోపాటు భూగర్భగనుల్లో కూడా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. తక్కువ వేతనంతో ఎక్కువ పనిచేయిస్తున్న కాంట్రాక్టు యాజమాన్యం.. తమకు కనీస సౌకర్యాలు కల్పించడంలేదని కార్మికులు వాపోతున్నారు. కనీసవేతనాలు పెంచడంతోపాటు ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పర్మినెంట్‌ కార్మికుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాల ని వారు కోరుతున్నారు.సింగరేణి బొగ్గు గనుల సంస్థలో కీలక విభాగాలైన సివిల్‌, సివిక్‌, బెల్ట్‌క్లీనింగ్‌, భవనాల నిర్వహణ, కన్వేయన్స్‌ వాహనాల డ్రైవర్లు, సేల్‌ పిక్కింగ్‌, తోట మాలి, స్కావెంజర్‌ తదితర పనలతోపాటు భూగర్భగనుల్లో కూడా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. తక్కువ వేతనంతో ఎక్కువ పనిచేయిస్తున్న కాంట్రాక్టు యాజమాన్యం.. తమకు కనీస సౌకర్యాలు కల్పించడంలేదని కార్మికులు వాపోతున్నారు. కనీసవేతనాలు పెంచడంతోపాటు ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పర్మినెంట్‌ కార్మికుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాల ని వారు కోరుతున్నారు..