Tuesday 14th of May 2024

కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందేలా కృషి

14 Dec , 2023 12:01 , IST
Article Image

● వైద్యులు అందుబాటులో ఉండాలి ● ఉదయం 6గంటల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటా ● చెన్నూర్‌ ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి.చెన్నూర్‌ ప్రాంత ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందేలా కృషి చేస్తానని చెన్నూర్‌ ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో బుధవారం మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, రూ.10 లక్షల రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని జెడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి, కలెక్టర్‌ సంతోష్‌, డీఎంహెచ్‌వో సుబ్బరాయుడులతో కలిసి ప్రారంభించారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వివేక్‌ మాట్లాడుతూ మరో నాలుగు పథకాలను త్వరలోనే ప్రారంభిసామని చెప్పారు. కోవిడ్‌ రోగులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాని కోరితే పట్టించుకోలేదని ఆరోపించారు. పేదలకు ఖరీదైన వై ద్యం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచా రని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల భర్తీకి కృషి చేస్తానని చెప్పారు. త్వరలో అభివృద్ధి పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ల సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. వారా నికి మూడు రోజులు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ప్రజల సమస్యలు తెలుసుకునేందు కు క్యాంప్‌ కార్యాలయంలో అందుబాటులో ఉంటా నని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో శేషాద్రి, మంచిర్యాల ఆర్డీవో రాములు, జెడ్పీ సీఈవో నరేందర్‌, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, వైద్యులు అరవింద్‌, సత్యనారాయణ పాల్గొన్నారు..