Tuesday 14th of May 2024

ధర ఉన్నా.. మిగిలేది సున్నా

14 Dec , 2023 12:05 , IST
Article Image

అన్నదాతకు ఎప్పుడూ గడ్డుకాలమే. అటు అకాల వర్షాలు.. ఇటు వర్షాభావంతో కర్శకులు కలవరపడుతుండగా దళారుల దోపిడీతో చిక్కిశల్యమవుతున్నారు. అరకొర పంట దిగుబడులకై నా గిట్టుబాటు ధర లభిస్తుందని ఆశిస్తే దళారులు గద్దల్లా తన్నుకుపోతున్నారు. ప్రభుత్వం నిర్వహించిన పంట కోత ప్రయోగాల్లోనూ దిగుబడి తగ్గినట్లు తేటతెల్లమైంది. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ప్రయోగాల్లో అన్ని పంటలది అదే దుస్థితి.ఒకప్పుడు వర్షాలు లేక పంటలు దెబ్బతినగా దిగుబడి అంతంతమాత్రమే వచ్చేది. రెండేళ్ల నుంచి వర్షాలు సమృద్ధిగా కురుస్తుండగా సకాలంలో కురవాల్సింది అకాలంలో విరుచుకుపడుతున్నాయి. మరోవైపు డ్రై స్పెల్‌ (వర్ష విరామం) తీరని నష్టాన్ని మిగిల్చింది. ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో భారీవర్షాలు కురుస్తుండగా పంటలు జలసమాధి అయిన ఘటనలు లేకపోలేదు. మొక్కజొన్న ఎదుగుదల లేకపోగా పత్తి పంటకు సంబంధించి పూత రాలి, కాత నల్లగా మారి పత్తి రూపుకోల్పోయింది. కరీంనగర్‌ అర్బన్‌ మినహా 15 మండలాల్లో ప్రధాన వనరు సాగు రంగమే కాగా మెట్ట ప్రాంతాల్లో అరకొర దిగుబడులు రాగా లోతట్టు ప్రాంతాల్లో పెట్టుబడిలో సగమే వచ్చే పరిస్థితి. సైదాపూర్‌, వీణవంక, చిగురుమామిడి, గంగాధర, జమ్మికుంట, హుజూజిల్లాలో 2 లక్షలకు పైగా ఎకరాల్లో వరి, 60 వేల ఎకరాలకు పైగా పత్తి సాగు చేశారు. ఆరంభంలో పంటలు కళకళలాడటంతో అన్నదాతలు దిగుబడులపై ఆశలు పెంచుకున్నారు. కానీ అకాలంలో కురిసిన వర్షాలు ఆశలను అడియాసలు చేశాయి. సకాలంలో వర్షాలు లేక దిగుబడిపై ప్రభావం పడింది. వరి గొలక వేసిన దశలో వర్షాలు కురవడంతో పూత రాలిపోయింది. దీనికి తోడు తెగుళ్లు ముప్పిరిగొన్నాయి. అలాగే పత్తి పంట ఎదుగుదల దెబ్బతినగా దోమ, ఇతర చీడపీడల ఉధృతితో పెట్టుబడి మరింత పెరిగింది. 150కి పైగా పంట కోత ప్రయోగాలు చేపట్టగా దిగుబడులు తక్కువ రావడం అన్నదాత దుస్థితికి అద్దం పడుతోంది. పత్తి 5–6 కిలోలు రాగా మక్క 23 కిలోలు, ధాన్యం 14–15కిలోలు మాత్రమే రావడం శోచనీయం.రాబాద్‌, గన్నేరువరం, తిమ్మాపూర్‌, ప్రకృతి వైపరీత్యాలతో పంట కోల్పోయిన రైతాంగానికి భరోసా కరువైంది. గత రెండు సీజన్లు కలిపి అకాల వర్షాలకు 30వేల ఎకరాల వరకు పంటలు దెబ్బతిన్నాయి. నామమాత్రంగా పంట నష్టానికి ప్రాథమిక అంచనా నివేదికలు తయారుచేసి చేతులు దులుపుకున్నారు. గతంలో బ్యాంకు రుణం పొందిన రైతులకు పరిహారమొచ్చేది. అలాగే పంటల బీమా ప్రీమియం చెల్లించిన వారికి పరిహారం అందేది. ఈ సారి ఆ ఊసే లేదు. దాదాపు అన్ని మండలాల్లోనూ పంటలు దెబ్బతిన్నాయి.శంకరపట్నం, మానకొండూరు తదితర ప్రాంతాల్లో అతి వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి.జిల్లాలో కరీంనగర్‌, జమ్మికుంట, గంగాధర, గోపాల్‌రావుపేట, చొప్పదండి మార్కెట్లలో పత్తి కొనుగోళ్లు జరగడం పరిపాటి. జిన్నింగ్‌ మిల్లులు, అన్ని మార్కెట్లలో పత్తి కొనుగోళ్లు అరకొరగా సాగుతుండగా దళారులే ధరలను శాసించే పరిస్థితి. అలాగే కొ నుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండగా రైతులు మిల్లర్లను ఆశ్రయిస్తున్నా రు. దీంతో తూకంలో కోత, తరుగు, నాణ్యత పేరుతో కిలోల కొద్ది కోతలు విధిస్తున్నారు. సిండికెట్‌గా మారి వీలైనంత మేర రైతులను దోచుకుంటున్నారు. .