Tuesday 14th of May 2024

కోదాడ కోర్టుకు నిధులు మంజూరు చేయించండి

14 Dec , 2023 12:20 , IST
Article Image

రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖల మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోదాడకు చెందిన న్యాయవాదులు కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కోదాడలో కోర్టు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి వెంటనే పనులను ప్రారంభించేలా కృషి చేయాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో పగడాల రాంచంద్రారెడ్డి ఉన్నారు. కోదాడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం ఉమ్మడి జిల్లాస్థాయిలో అండర్‌–14, 17 బాలబాలికల విభాగాల్లో బేస్‌బాల్‌ పోటీలు నిర్వహించి క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఎండి.ఆజంబాబా తెలిపారు. ఈమేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 9గంటల వరకు రిపోర్టు చేయాలని సూచించారు. క్రీడాకారులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకొని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావాలాలని ఆకాంక్షించారు.గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు కేవైసీ పేరిట చేస్తున్న దందాపై కలెక్టర్‌ వెంకట్రావు విచారణకు ఆదేశించారు. అలాగే విచారణ అధికారిగా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)ను నియమించారు. గ్యాస్‌ కేవైసీ పేరుతో ఏజెన్సీ నిర్వాహకులు వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తుండడం, కేవైసీ చేయించుకుంటేనే రూ. 500కు సిలిండర్‌ అంటూ అబద్ధపు ప్రచారం చేయడం, సురక్ష పైపులను బలవంతంగా అంటగడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ‘గ్యాస్‌ కేవైసీ పేరిట దగా’ శీర్షికన సాక్షిలో బుధవారం ప్రచురించిన కథనానికి కలెక్టర్‌ పైవిధంగా స్పందించారు.యాదాద్రి జిల్లా పోచంపల్లిలో ఈ నెల 20న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఖరారైన సందర్భంగా బుధవారం స్థానిక బాలాజీ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించనున్న సభ ఏర్పాట్లను చౌటుప్పల్‌ ఆర్డీఓ జగన్నాథరావు, అడిషనల్‌ డీసీపీ రవికుమార్‌, జిల్లా చేనేత జౌళిశాఖ ఏడీ విద్యాసాగర్‌, తహసీల్దార్‌ వీరాబాయి పరిశీలించారు. సభాప్రాంగణం, చేనేత స్టాల్స్‌, భద్రతా ఏర్పాట్లను చూశారు. అదేవిధంగా రాష్ట్రపతితో పాటు వచ్చే మొత్తం 3 మిలట్రీ చాపర్‌ల కోసం అవసరమైన హెలిపాడ్‌ స్థలాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌ పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న తాత్కాలిక గొర్రెలమంద పాకలు, చెట్లు, కడీలు, కరెంట్‌తీగలను తొలగించి స్థలాన్ని చదును చేయాలని అధికారులకు సూచించారు. 3 హెలిపాడ్‌లు నిర్మించాలని ఆదేశించారు. అనంతరం రంజనీ హ్యాండ్లూమ్‌ యూనిట్‌ను సందర్శించారు. వారి వెంట ఆర్‌అండ్‌బీ ఈఈ శంకరయ్య, డీఈ సుగేందర్‌, ఎస్‌ఐ విక్రమ్‌రెడ్డి, ఎంఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఏఈ క్రాంతి, మున్సిపల్‌ మేనేజర్‌ శ్రీనివాసస్వామి, సీనియర్‌ అసిస్టెంట్‌ రాజేశ్‌ తదితరులున్నారు..