Tuesday 14th of May 2024

మార్కెట్‌కు స్థలం కొరత

14 Dec , 2023 12:22 , IST
Article Image

వ్యవసాయ మార్కెట్‌కు రోజూ అధికంగా ధాన్యం వస్తుండటంతో స్థలం సరిపోక దారిలోనే పోస్తున్నారు. ఉన్న కొద్ది స్థలంలోనే ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం చేపట్టడం వల్ల ఇంకా ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను వేరే స్థలంలో నిర్మించాలి.మార్కెట్‌లో ఉన్న స్థలమే సరిపోక సీజన్‌లో సరుకులు పోయడానికి ఇబ్బందులు పడుతున్నాం. ఈ కొద్ది స్థలంలోనే వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌ నిర్మించడం వల్ల పది పదిహేను బస్తాల ధాన్యం పోయలేక పోతున్నాం. సరుకులు అధికంగా వచ్చిన రోజు రైతులు, వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.తిరుమలగిరి మార్కెట్‌ను స్థలం కొరత వేధిస్తోంది. వ్యవసాయ సీజన్లలో ధాన్యం పోటెత్తుతుండడం... ఇప్పటికే స్థలం సరిపోక కాంటాలతో పాటు ఎగుమతులు, దిగుమతులకు సమస్యలు తలెత్తుతుండడం.. వెరసి మార్కెట్‌కు తరచూ సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు కొంత స్థలంలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులు చేపట్టడంతో సమస్య మరింత జఠిలంగా మారింది. దీంతో రైతులకు ఇక్కట్లు తప్పడంలేదు..