Tuesday 14th of May 2024

సీఎం దృష్టికి మోడల్‌ స్కూల్‌ సమస్యలు

14 Dec , 2023 12:38 , IST
Article Image

తెలంగాణ మోడల్‌ స్కూల్‌ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీఎస్‌ ఎంఎస్‌టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొండయ్య బుధవారం ఎమ్మెల్సీ నర్సిరెడ్డితో కలిసి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కొండయ్య పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.మాజీ సీఎం కేసీఆర్‌ నగరంలోని యశోద ఆస్పత్రిలో బుధవారం పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పరామర్శించారు. కేసీఆర్‌ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే కోలుకుని ప్రజల్లోకి వస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కేసీఆర్‌పై ఉందని అన్నారు.ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గోపాల్‌ ఆదేశించారు. బుధవారం మండలంలోని శివారెడ్డిపల్లి, బొంపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం తోపాటు, రైతులకు సదుపాయాలు కల్పించాలని సూచించారు. ధాన్యం తేమ శాతం పరిశీలించి మద్దతు ధరకు వడ్లు కొనుగోలు చేయాలన్నారు. తూకాల్లో తేడా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం నింపేందుకు గోనె సంచులను అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మండల అధికారి ప్రభాకర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.పట్టణంలో వెలసిన పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర ఆలయంలో ఈ నెల 17వ తేదీ నుంచి ధనుర్మాస పూజలు ప్రారంభం కానున్నట్లు ఆలయ ధర్మకర్తలు, అర్చకులు తెలిపారు. 16వ తేదీ అర్ధరాత్రి ధనుస్సంక్రమణ జరుగుతుందని తెలిపారు. 17వ తేదీ వేకువజాము నుంచి ఆలయంలో ధనుర్మాస పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 17 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 4గంటలకు వాయిద్యం, 5 గంటలకు సుప్రభాత సేవ, 5–30గంటలకు ఆలయ పండితులు శ్రీనివాసాచారి తిరుప్పావై పారాయణం చేస్తారని, అనంతరం ప్రవచనాలు అందించనున్నారని తెలిపారు. .