Tuesday 14th of May 2024

ఆర్టీసీ ఉద్యోగులకు నగదు ప్రోత్సాహకాలు

14 Dec , 2023 01:12 , IST
Article Image

పుంగనూరు ఆర్టీసీ డిపోలో ఇంధనం పొదుపు చేసి ఆదర్శంగా నిలిచిన డ్రైవర్లు అన్వర్‌, చలపతి, పల్లెవెలుగు సర్వీసు కండక్టర్లు జి.బాబు, కిషోర్‌కు రూ.500 చొప్పున నగదు ప్రోత్సాహక బహుమతులను డీఎం సుధాకరయ్య బుధవారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ, సంస్థలో ఇంధన పొదుపుతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్న సిబ్బందిని సముచిత రీతిలో సత్కరించామన్నారు. ఉద్యోగులు సంస్థ పరిపుష్టికి ఇతోధికంగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్యారేజ్‌ సూపర్‌వైజర్‌ రాధాకృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యతా ప్రమాణాలతో మధ్యాహ్న భోజనం పెట్టాలని ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప ఆదేశించారు. మండలంలోని నెల్లిపట్ల జెడ్పీ హైస్కూలులో బుధవారం మధ్యాహ్న భోజనాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తాజా కూరగాయలు, ఆకుకూరలతో సాంబారు చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు చదువుల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కేశవులు, మండల వైఎస్సార్‌ సీపీ కన్వీనర్‌ కార్తీక్‌ పాల్గొన్నారు.మండలంలోని శివునికుప్పంలో వివిధ అభివృద్ధి పనులను బుధవారం, వ్యవసాయ మార్కెటింగ్‌ సంచాలకులు, స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హేమంత్‌కుమార్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఉప మార్కెట్‌ కోసం మంజూరైన 7.09 ఎకరాల స్థలాన్ని స్థానిక సర్వేయర్లతో సర్వే చేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ, రైతుల సౌకర్యార్థం ఉపమార్కెట్‌ ఏర్పాటుకు సన్నద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఈఈ హరినారాయణరెడ్డి, పాలకవర్గ సభ్యులు వేణుగోపాల్‌ రెడ్డి, సుబ్రమణ్యం, సంజీవకుమార్‌, శంకర్‌రెడ్డి, లోకేష్‌, సిబ్బంది పాల్గొన్నారు..