Tuesday 14th of May 2024

రంగం సిద్ధం

14 Dec , 2023 01:37 , IST
Article Image

ఈ నెల 15న మండల స్థాయి, 23న జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాట్లు పూర్తిచేసిన విద్యాశాఖ భుత్వ ఆదేశాల మేరకు విద్యార్థుల మేధస్సుకు పదునుపెట్టే వైజ్ఞానిక ప్రదర్శనలకు జిల్లా విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రదర్శనలు నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు పూర్తిచేసింది. బాలల సైన్స్‌కాంగ్రెస్‌, ఇన్‌స్పైర్‌ మనాక్‌, జాతీయ సైన్స్‌ దినోత్సవాల సందర్భంగా విద్యార్థుల్లో వైజ్ఞానిక విజ్ఞానం పెంచేందుకు ప్రభ్తువం ఏటా వైజ్ఞానిక పోటీలు నిర్వహిస్తోంది. జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీల్లో భాగంగా పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి లో విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 23న పార్వతీపురం డీవీఎంఎం ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ముందుగా ఈ నెల 15న మండల విద్యా శాఖ అధికారుల పర్యవేక్షణలో మండల స్థాయిలో ప్రదర్శనలు జరపనున్నారు.ప్రతి పాఠశాల నుంచి గ్రూప్‌ విభాగంలో ఇద్దరు, వ్యక్తిగత విభాగం నుంచి ఒకరు, టీచర్‌ విభాగం నుంచి ఒక ఉపాధ్యాయుడు కింది అంశాల్లో తమ ప్రాజెక్టులు ప్రదర్శించవచ్చు. మండల స్థాయిలో అన్ని ప్రభుత్వ మేనేజ్‌మెంట్‌ పాఠశాలల్లో 8–10 తరగతుల మధ్య బోధన కొనసాగిస్తున్న విద్యార్థు లు అర్హులు.పాఠశాల, మండల, జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలంటూ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో మండలం నుంచి ఒక్కో విభాగంలో ఒక్కొక్కటి వంతున మొత్తం మూడు ప్రాజెక్టులు జిల్లా స్థాయికి ఎంపిక చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 45 ప్రాజెక్టులు ఎంపిక చేస్తారు. అలాగే, 15 మండలాల నుంచి అటల్‌ల్యాబ్స్‌ ఉన్న పాఠశాలల నుంచి రెండు ప్రాజెక్టుల చొప్పున నేరుగా జిల్లా స్థాయిలో ప్రదర్శలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేసేందుకు డీఈఓ నేతృత్వంలో జిల్లా సైన్స్‌ అధికారి, ఉపాధ్యాయులు సంసిద్ధమవుతున్నారు. విద్యార్థుల చదువు, ఆటలే కాకుండా విభిన్న వైజ్ఞానిక అంశాల్లో ప్రతిభ చూపేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రాజెక్టులను సిద్ధం చేస్తున్నారు. గతంలో కేవలం జిల్లా స్థాయిలోనే విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించేవారు. గత ఏడాది నుంచి ప్రభుత్వం పాఠశాల, మండల స్థాయిల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. నూతన ఆవిష్కరణలే ధ్యేయంగా విద్యార్థులు ప్రాజెక్టులు ప్రదర్శించేలా ప్రభుత్వం ప్రోత్సహి స్తోంది.వైజ్ఞానిక ప్రదర్శనల్లో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపాలి. గత ఏడాది సీతానగరం మండలం జోగింపేట కేజీబీవీ విద్యార్థులు ప్రదర్శించిన ‘భూగర్భ వ్యవసాయంపై ప్లాస్టిక్‌ వ్యర్థాల ప్రభా వం’ అనే ప్రదర్శన జిల్లాకు పేరుతెచ్చింది. విద్యార్థులను ప్రోత్సహించేలా ఏటా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. విద్యార్థుల్లోని అంతర్గతంగా దాగిన సృజనాత్మక ప్రతిభను వెలికి తీసేందుకు ఎంఈఓలు, హెచ్‌ఎంలు, సబ్జెక్టు టీచర్లు అంకితభావంతో పనిచేయాలి.విద్యా, వైజ్ఞానిక పోటీలను ప్రధానంగా భౌతిక శాస్త్రం (పీఎస్‌), రసాయనిక శాస్త్రం (కెమిస్ట్రీ), గణిత, ఖగోళ, పర్యావరణ, జీవశాస్త్రాలతో పాటు ఇంజినీరింగ్‌ ఇన్‌ కంప్యూటర్‌ సైనన్స్‌ అనే అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. విద్యార్థులు వ్యక్తిగతంగా లేదా గ్రూపుగా పోటీపడవచ్చు. ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా కూడా పోటీల్లో పాల్గొనే అవకాశముంది. ఉపాధ్యాయ విభాగంలో పోటీ పడేవారు ఎనిమిది అంశాల్లో ఏదో ఒకటి ఎంచుకుని ఒక ఉపాధ్యాయుడు మాత్రమే పాల్గొంటారు. వ్యక్తిగత విభాగంలో పోటీ పడే విద్యార్థులు ఎనిమిది అంశాల్లో ఏదో ఒకటి ఎంచుకుని గైడ్‌ టీచర్‌తో కలిసి పోటీ పడవచ్చు. .