Tuesday 14th of May 2024

ఈసీని కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు

14 Dec , 2023 02:49 , IST
Article Image

టీడీపీ నేతలు దొంగ ఓట్లు చేర్పిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మంత్రులు జోగి రమేష్‌, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి. టీడీపీ నేతలు దొంగ ఓట్లు చేర్పించడంలో సిద్ధహస్తులు. ప్రజలను ఏ విధంగా మోసం చేయాలనేది టీడీపీ ఆలోచన’’ అంటూ మండిపడ్డారువైఎస్సార్‌సీపీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది. టీడీపీ నేతలు అక్రమ మార్గంలో గెలిచేందుకే ప్రయత్నిస్తున్నారు. చాలమందికి రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయి. వాటిని తొలగించాలని ఈసీని కోరాం. ఎవరికైనా సరే ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి’’ అని వైఎస్సార్‌సీ నేతలు పేర్కొన్నారు.హైదరాబాద్, ఏపీలో 4 లక్షల 30 వేల 264 ఓట్లు ఉన్నాయి. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు అందించాం. డబుల్ ఎంట్రీలు తొలగించాలని సీఈవోను కోరాం. దేశంలో ఒకేచోట ఓటు ఉండాలనేది వైసీపీ విధానం. ఇలాంటి ఓట్లపై విచారణ జరిపించి తొలగించాలని కోరాం.ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది సీఎం జగన్ ఆకాంక్ష. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. మోసాలు చేయడమే చంద్రబాబు ప్రధాన అజెండా. ఒక సామాజికవర్గం ఓట్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నాయి. టీడీపీ ప్రలోభాలతో ప్రజలను లోబరుచుకుంటుంది. డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు తాను చేసిన తప్పులు ఇతరులపైకి నెడతారు. ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియాలో అబద్ధాలు చెప్పాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు..