Tuesday 14th of May 2024

ఇవీ వివరాలు

14 Dec , 2023 02:52 , IST
Article Image

ఎన్నో ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టా కాగితాలు చూడలేమని, భూములను అమ్ముకోలేమని భావించిన రైతుల కల సాకారం అయ్యింది. ప్రభుత్వం చేపట్టిన భూ సంస్కరణల వల్ల రైతులు బాగుపడ్డారు. జిల్లా స్థాయిలో అసైన్మెంట్‌ భూముల పట్టాలు 5,517 మంది రైతులు 6,507 ఎకరాలు పొందితే ఇందులో ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోని రైతులు 4271 మంది 5,023.02 ఎకరాల అసైన్మెంట్‌ భూములకు పట్టాలు పొందారు.గత టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గాల అసైన్మెంట్‌ కమిటీ చైర్మన్లుగా తప్పించి జిల్లా ఇన్‌చార్జి మంత్రికి బాధ్యతలు అప్పగించారు. వారు అసైన్మెంట్‌ కమిటీ అనుమతులను మమ అనిపించారు. దీంతో అర్హులైన రైతులు భూములు పొందలేకపోయారు. గ్రామాల్లో టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు అక్రమమార్గంలో భూములకు పట్టాలు పొందారు. ఫలితంగా సాగు చేసుకునే వారు ఒకరు, పట్టాలు పొందిన వారు మరొకరు కావడం వల్ల గ్రామాల్లో భూ తగాదాలు పెరిగాయి. ఇప్పటికీ ఆ తగాదాలు కొనసాగుతూనే ఉండడం గమనార్హం. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలనే అసైన్మెంట్‌ కమిటీ చైర్మన్లుగా కొనసాగించి అర్హులైన రైతులకు భూములను కేటాయించింది. గతంలో వివాదాస్పదంగా మారిన భూములకు సైతం పరిష్కార మార్గం చూపింది. దీంతో పట్టాలు పొందిన రైతులు విలువైన తమ భూములకు శాశ్వత యజమానులుగా మారారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ గ్రామాల్లో భూ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. పొరపాట్లు ఉంటే అధికారులు, నాయకులు కలసి సరిదిద్ది తిరిగి రైతులకు భూ పట్టాలను అందజేయనున్నారు. ఇదే విషయాన్ని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇటీవల పలుమార్లు సభాముఖంగా వెల్లడించారు. అర్హులైన ఏ రైతు ఆందోళన చెందాల్సిన పనిలేదని అనివార్య కారణాల వల్ల అర్హులైన వారు భూమిని పొందలేకపోతే తన దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరించి పట్టాలను అందజేస్తామన్నారు..