Tuesday 14th of May 2024

గంజాయిపై ఉక్కుపాదం

14 Dec , 2023 03:03 , IST
Article Image

పశ్చిమలో గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని డీఐజీ అశోక్‌కుమార్‌ అన్నారు. పాలకొల్లు పట్టణ, రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లను పరిశీలించారు. IIలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఈనెల 19న భీమవరం పర్యటించే అవకాశం ఉన్నందున ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ మంగళవారం ఏర్పాట్లు పరిశీలించారు. వాస్తవానికి ఈ నెల 12న ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది. భారీ వర్షాల నేపథ్యంలో సభ నిర్వహించే ప్రాంతం అనుకూలంగా లేకపోవడంతో పర్యటన రద్దయింది. పర్యటన ఈ నెల 19న జరిగే అవకాశముంది. ఇదే వేదిక పైనుంచి జగనన్న విద్యా దీవెన నిధులను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు.ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు వేగవంతం చేయాలని జాయింటు కలెక్టరు ఎస్‌.రామసుందర్‌ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి భీమవరం పర్యటన నేపథ్యంలో మంగళవారం స్థానిక బైపాస్‌ రోడ్‌లోని గ్రంధి వెంకటేశ్వరరావు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ వెనుక లేఅవుట్‌లో సభావేదిక, పురపాలక సంఘం పక్కన లూథరన్‌ హైస్కూలు గ్రౌండులో హెలిప్యాడ్‌ను జాయింటు కలెక్టరు పరిశీలించారు. జాయింటు కలెక్టరు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. సభావేదిక, హెలిప్యాడ్‌ స్థలాల్లో ఇంకా మిగిలి ఉన్న వర్షపు నీటిని తొడించి, నేల చదును చేయాలన్నారు. .