Tuesday 14th of May 2024

ముగిసిన అథ్లెటిక్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు

14 Dec , 2023 03:10 , IST
Article Image

నన్నయ విశ్వవిద్యాలయం అంతర కళాశాలల యూత్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు బుధవారం ముగిశాయి. స్ధానిక ఎస్‌కేవీటీ ప్రభుత్వ కళాశాలలో జరిగిన ముగింపు కార్యక్రమానికి అర్బన్‌ సీఐ సంజయ్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ఎబిల్‌ రాజబాబు అధ్యక్షత వహించారు.పురుషుల విభాగంలో భీమవరం డీఎన్‌ఆర్‌ కళాశాల ఓవరాల్‌ చాంపియన్‌ విజేతగా నిలిచింది. మహిళా విభాగంలో గోపన్నపాలెం ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాల చాంపియన్‌ షిప్‌ విజేతగా నిలిచారు. డీఎన్‌ఆర్‌ భీమవరం కళాశాల విద్యార్థిని జస్వంత్‌ బెస్ట్‌ అథ్లెట్‌గా ఎంపికై ంది. 21 కిలోమీటర్లు 10 కేఎంలో ఎసేకేవీటీ కళాశాల విద్యార్థి మోహన్‌ రావు గెలిచాడు. విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న రౌడీ మూకలు జైలు పాలు కావడం తప్పదని జిల్లా ఎస్పీ జగదీష్‌ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్‌ కె.మాధలత ఆదేశాల మేరకు మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దుర్గనగర్‌కు చెందిన ఎర్ర సాయికిరణ్‌ అలియాస్‌ దొంగసాయిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. ఆ వివరాలను జిల్లా ఎస్పీ బుధవారం వివరించారు. ఎర్ర సాయికిరణ్‌పై జిల్లాలో సుమారు ఆరు కేసులు నమోదయ్యాయన్నారు. ఇందులో ఒకటి హత్య కేసు, రెండు గంజాయి కేసులు, రెండు చోరీ కేసులు, ఒక గొడవ కేసు ఉన్నాయన్నారు. అనేకసార్లు చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఇతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడంతో కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించామన్నారు. బ్లేడ్‌ బ్యాచ్‌, రౌడీలు మూకలు వ్యవస్థీకృత నేరాలకు అలవాటు పడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తే సహించేది లేదన్నారు.వారి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి, నేరం చేయాలనే ఆలోచన నుంచి దృష్టి మరల్చడానికి పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తామన్నారు.డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తానికి చెందిన అడబాల లక్ష్మి గ్రామ స్థాయి నుంచి ఉన్నతి స్థాయికి ఎదిగింది. స్థానిక సీఎస్‌ఎం జూనియర్‌ కాలేజీ, గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న సమయంలో పీడీ గొలకోటి ఫణీంద్ర, విజ్జూ, సరస్వతిల వద్ద శిక్షణ పొందింది. 2020లో జమ్మూ కశ్మీర్‌లో వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన జూనియర్‌ నేషనల్‌ పోటీలలో పాల్గొంది. 2022లో భోపాల్‌లో నిర్వహించిన అండర్‌–19 ఎస్‌జీఎఫ్‌ జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటింది. ఈ ఏడాది న్యూఢిల్లీలో జరిగే అండన్‌ –19 ఎస్‌జీఎఫ్‌ జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనుంది. ‘ఆడుదాం ఆంధ్ర పోటీలు సచివాలయ స్థాయి నుంచి నిర్వహించడం చాలా బాగుంది. ఇలా పోటీలు నిర్వహించడం వల్ల కొత్తవారికి అవకాశం వస్తోంది. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు గుర్తింపు వస్తోంది’ అని లక్ష్మి తెలిపారు. ఈ బాలిక పేరు సన్ని ప్రియ. యు.కొత్తపల్లి జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. తండ్రి కరా రాజు, తల్లి పావని. వీరిది మత్స్యకార కుటుంబం. ఆమెకు హాకీ అంటే ఇష్టం. రెండేళ్ల నుంచి ఆడుతోంది. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తోంది. క్రీడల్లో రాణించి స్పోర్ట్స్‌ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది సన్ని ప్రియ లక్ష్యం. ప్రస్తుతం మదనపల్లిలో జరిగే అండర్‌–14 పోటీల్లో పాల్గొనుంది. ఆడుదాం ఆంధ్ర కాన్సెఫ్ట్‌ తనకెంతగానో నచ్చిందని ఈ బాలిక సంతోషం వ్యక్తం చేస్తోంది..