Monday 29th of April 2024

‘హాయ్‌ నాన్న’ మూవీ రివ్యూ

14 Dec , 2023 03:58 , IST
Article Image

ఎలా ఉందంటే..అమ్మ గురించి నాన్న తన కూతురుకి చెప్పే గొప్ప ప్రేమ కథ ఇది.  ఈ తరహా కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం..గొడవపడి విడిపోవడం..చివరకు కలిసిపోవడం.. ఇలాంటి కథాంశంతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఇటీవల వచ్చిన ‘ఖుషి’ నేపథ్యం కూడా ఇదే. కానీ హాయ్‌ నాన్నలో ప్రత్యేకత ఏంటంటే.. లవ్‌స్టోరీలోని ట్విస్టులు కొత్తగా ఉంటాయి.  అమ్మ పాత్రని దర్శకుడు మలిచిన తీరు సినిమాను నిలబెట్టింది. హీరో హీరోయిన్ల మానసిక సంఘర్షణ హృదయాలను హత్తుకుంటాయి.తండ్రి కూతుళ్ల బాండింగ్‌ని తొలి సీన్‌లోనే చూపిస్తూ చాలా ఎమోషనల్‌గా కథను ప్రారంభించాడు దర్శకుడు. మహి తన తల్లిగా యష్ణని ఊహించుకున్నప్పటి నుంచి  ప్రేమకథ మొదలవుతుంది. విరాజ్‌, వర్షల పరిచయం.. ప్రేమ.. పెళ్లి...ఇవన్నీ రొటీన్‌గా అనిపిస్తున్నాయి. కథనం నెమ్మదిగా సాగడం కూడా కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే ఒక్కసారి ట్విస్ట్‌ రివీల్‌ అయ్యాక.. గుండె బరువెక్కుతుంది. ఇంటర్వెల్‌ సీన్‌ ద్వితియార్థంపై ఆసక్తి పెంచుతుంది.సెకండాఫ్‌లో భావోద్వేగాలు మరింత బలంగా రాసుకున్నాడు దర్శకుడు. కొన్ని చోట్ల సాగదీసినట్లు అనిపించినా.. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతారు. సన్నీవేశాలతో కాకుండా సంభాషణలతో కూడా ప్రేక్షకులను ఎమోషనల్‌కు గురి చేశాడు. ‘నువ్వు నిజమైన అమ్మకి కాదు’ అని చిన్నారి చెప్పడం..‘ఎక్కడ తప్పు చేశాను.. నా ప్రేమ సరిపోవడం లేదా’ అని హీరో కూతురితో అనడం.. ‘నేను దాచుకున్న నిజం నా కూతురుకి చెప్పావు.. నువ్వు దాచిన నిజం నీ కూతురుతో చెప్పనా?’అని హీరోయిన్‌ తల్లితో నాని అనడం.. ప్రతిదీ గుండెల్ని పిండేస్తుంది. క్లైమాక్స్‌లో జయరామ్‌ పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది.; కథనం నిదానంగా సాగినప్పటికీ.. కొన్ని ట్విస్టులు.. ప్రధాన పాత్రలు పండించిన భావోద్వేగాలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి..