Sunday 28th of April 2024

‘యానిమల్‌’మూవీ రివ్యూ

14 Dec , 2023 04:04 , IST
Article Image

ఎలా ఉందంటే..తండ్రి కోసం ఏదైనా చేయగలిగే ఓ కొడుకు పిచ్చి ప్రేమ;కథే ‘యానిమల్‌’. ఇదొక రివేంజ్‌ డ్రామా.కానీ సందీప్ రెడ్డి వంగా ఈ కథను చాలా బోల్డ్‌గా, వయోలెంట్‌గ; తెరపై చూపించాడు. కథగా చూస్తే..ఇందులో తండ్రి కొడుకుల ప్రేమ, కుటుంబ అనుబంధాలు, భార్య భర్తల బాండింగ్‌ ఇవన్నీ ఉంటాయి. కానీ ఫ్యామిలీతో కలిసి చూడలేని విధంగా కథనం సాగుతుంది. అలాగే కామెడీ కూడా బోల్డ్‌గానే ఉంటుంది.ఇక సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. హీరో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి వచ్చిన తర్వాత ఇంట్లో డాక్టర్లతో మాట్లాడే మాటలు చాలా బోల్డ్‌గా ఉంటాయి. హీరో నగ్నంగా ఆరు బయటకు రావడానికి గల కారణం కన్విన్సింగ్‌గానే ఉంటుంది. ఈ సీన్‌ కంటే ముందు వచ్చే సన్నివేశాల్లో రణ్‌బీర్‌ ఫెర్ఫార్మెన్స్‌ అదిరిపోయేలా ఉంటుంది. విజయ్‌ ఎంత క్రూరంగా ప్రవర్తించినప్పటికీ.. గీతాంజలి ఎందుకు భరిస్తుందో తెలియజేసే సీన్‌..భార్య భర్తల మధ్య ఉన్న బాడింగ్‌ని తెలియజేస్తుంది.ఇక జోయాతో రొమాన్స్‌ తర్వాత..గీతాంజలి, విజయ్ మధ్య వచ్చే సీన్లు చాలా మెచ్యుర్డ్‌గా ఉంటాయి. బాబీ డియోల్‌ పాత్ర ఎంట్రీ సీన్‌ అదిరిపోతుంది. క్లైమాక్స్‌లో బాబీ, రణ్‌బీర్‌కి మధ్య వచ్చే యాక్షన్‌ సీన్‌ సినిమాకు మరో హైలెట్‌. యాక్షన్‌, ఫ్యాక్షన్‌ కలబోసిన ఓ ఎమోషననల్‌ ఫ్యామిలీ డ్రామా ఇది. అయితే మితిమీరిన హింస, శృంగార సన్నివేశాల కారణంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ కు కాస్త ఇబ్బంది అనిపించొచ్చు కానీ, మిగతావారికి మాత్రం ఓ డిఫరెంట్‌ మూవీ చూశామనే ఫీలింగ్‌ కలుగుతుంది..