Monday 9th of December 2024

అనుమానాస్పదంగా ‘వధువ'

14 Dec , 2023 04:14 , IST
Article Image

అవికా గోర్‌ ప్రధాన పాత్రలో, నందు, అలీ రెజా కీలక పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘వధువు’. శ్రీకాంత్‌ మొహ్తా, మహేంద్ర సోని నిర్మాణంలో పోలూరు కృష్ణ రూపొందించిన ఈ వెబ్‌ సిరీస్‌ ఈ నెల 8 నుంచి హాట్‌స్టార్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ– ‘‘ఓ కుటుంబంలోని సభ్యులందరూ ఎందుకు అనుమానాస్పదంగా కనిపిస్తారు? అనే అంశం ‘వధువు’లో కొత్తగా ఉంటుంది. అవికా, నేను బెక్కెం వేణుగోపాల్‌ ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాం’’ అన్నారు.‘‘ఈ సిరీస్‌లో నా పాత్ర  చాలా సెటిల్డ్‌గా ఉంటుంది’’ అన్నారు అలీ రెజా. ‘‘బెంగాలీ సిరీస్‌ ‘ఇందు’ను ‘వధువు’గా రీమేక్‌ చేశాం. అయితే నేను సోల్‌ను మాత్రమే తీసుకున్నాను. మన నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేశాం. ఫస్ట్ ఎపిసోడ్ లో అవికా పెళ్లై అత్తవారింటికి వస్తుంది. సెకండ్ ఎపిసోడ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. అవికా అత్తవారింటికి ప్రేక్షకుల్ని కూడా తీసుకెళ్తాం. అంత గ్రిప్పింగ్ గా సిరీస్ ఉంటుంది. సెకండ్ ఎపిసోడ్ నుంచి 7వ ఎపిసోడ్ వరకు అంతే క్యూరియస్ గా కథ సాగుతుంది. 7వ ఎపిసోడ్ కిక్ ఇచ్చేలా ఉంటుంది’ అన్నారు దర్శకుడు పోలూరు కృష్ణ..