Wednesday 15th of May 2024

అందుబాటులోకి కో-పైలెట్.. అంతా బాగానే ఉంది కానీ!

14 Dec , 2023 04:32 , IST
Article Image

సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్. మన నిజ జీవితంలో జరగని వాటిని ఎక్కువగా సినిమాల్లో చూస్తూంటాం. ఎంజాయ్ చేస్తుంటాం. కమర్షియల్ చిత్రాలు కాకుండా మనం ఆశ్చర్యపోయేలా కొన్ని మూవీస్ వస్తుంటాయి. టెక్నాలజీ స్టోరీతో తీసే చిత్రాలన్నీ ఈ కేటగిరీలో ఉంటాయని చెప్పొచ్చు. అలా అప్పుడెప్పుడో 18 ఏళ్ల క్రితం ఓ హాలీవుడ్ మూవీ వచ్చింది. ఇందులోని స్టోరీని పోలినట్లు.. రియల్ లైఫ్ లో ఓ సంఘటన జరిగింది. ఇక్కడవరకు బాగానే ఉంది కానీ ఓ విషయం మాత్రం కాస్త భయపెడుతోంది.మన జీవితంలో టెక్నాలజీ అనేది ఇప్పుడు భాగమైపోయింది. ఫోన్, ఇంటర్నెట్ లేనిదే ఏ పని జరగట్లేదు. ఇక ఈ మధ్య ఏఐ (కృత్రిమ మేధ) అని కొత్తగా వచ్చింది. మనిషి అవసరం లేకుండా ఇది అన్ని పనులు చక్కబెట్టేస్తుంది. అయితే దీనివల్ల ప్రస్తుతానికైతే అంతా బాగానే నడుస్తోంది. కానీ భవిష్యత్తులో ఇలానే ఉంటుందా లేదా అనేది చూడాలి. సరే ఇదంతా పక్కనబెడితే అసలు విషయానికొచ్చేద్దాం.2005లో హాలీవుడ్‌లో 'స్టెల్త్' అనే సినిమా తీశారు. ఈ స్టోరీలో భాగంగా విమానాన్ని నడిపేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సిస్టమ్‌ని తయారు చేస్తారు. దాన్ని యుద్ధ రంగాలోకి పంపిస్తారు. కానీ సిస్టమ్‌లో అనుకోని పొరపాట్ల వల్ల టార్గెట్‌తో పాటు సొంత మనుషులపైనా ఇది దాడి చేసి చంపేస్తుంది. చివరకు దీన్ని ఎలా ఆపారనేది సినిమా స్టోరీ.అయితే తాజాగా అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీ వాళ్లు.. ఏఐతో నడిచే కో-పైలెట్‌ని సృష్టించారు. సాధారణంగా ఓ విమానంలో ఇద్దరూ పైలెట్స్ ఉంటారు. ఒకవేళ ఏఐ పైలెట్ అందుబాటులోకి వస్తే.. ఓ మనిషి అవసరం తగ్గిపోతుంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ టెక్నాలజీని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ 'స్టెల్త్' సినిమాలో జరిగినట్లు ఏఐ పైలెట్ ఏమైనా రివర్స్ అయితే మాత్రం ఘోర ప్రమాదం తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు..