Sunday 28th of April 2024

మొదటి ఎంబీయే మహిళా సర్పంచ్‌,లక్షల ప్యాకేజిని వదిలి..

14 Dec , 2023 06:28 , IST
Article Image

ఛావీ రాజావత్‌ రాజస్థాన్‌లోని సోడా గ్రామంలో పుట్టి పెరిగింది. పట్నంలో ఉన్నత చదువులు చదివి, కళ్లు చెదిరే ప్యాకేజీతో కార్పొరేట్‌ ఉద్యోగంలో చేరింది. కానీ, చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి గ్రామానికి వెళ్లింది. సర్పంచ్‌గా ఎన్నికల్లో నిలబడి గెలిచింది. పదేళ్లపాటు సర్పంచ్‌గా పనిచేసింది. మొదటి ఎంబీయే మహిళా సర్పంచ్‌గా వార్తల్లో నిలిచి, యుఎన్‌లో ప్రసంగం చేసింది. గ్రామాన్ని మోడల్‌ గ్రామంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు గ్రామాభివృద్ధికి కృషి చేస్తూనే, హోటల్‌ వ్యాపారం చేస్తోంది. ఆసక్తి గలవారికి గుర్రపు స్వారీలో శిక్షణ ఇస్తోంది. ‘‘2010లో తొలిసారి సర్పంచ్‌ అయినప్పుడు గ్రామ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. గ్రామం తీవ్ర కరువుతో అల్లాడిపొంయింది. సాగునీరు లేదు. 13–14 సంవత్సరాలుగా రుతుపవనాలు లేవు. భూగర్భ జలాలను వాడుకోలేకపొంయేవారు. 3–4 గంటలకు మించి విద్యుత్‌ సరఫరా లేదు. రోడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉంది. ఈ సవాళ్లతో సోడా పంచాయితీ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టాను. మొదటి టర్మ్‌లో కొన్ని పనులు పూర్తయ్యాయి. మా తాత బ్రిగేడియర్‌ రఘుబీర్‌సింగ్‌ 1990 వరకు సర్పంచ్‌గా చేశారు. నాకు మా ఊరు అంటే ఎప్పుడూ ఇష్టమే. బెంగుళూరులోని రిషి వ్యాలీ స్కూల్, జైపూర్‌లోని మాయో కాలేజీ గర్ల్స్‌ స్కూల్‌లో చదువుకున్నాను. వేసవి సెలవులు వచ్చినప్పుడల్లా మా ఊరిలోనే ఉండేదాన్ని. ఢిల్లీలోని మహిళా శ్రీరామ్‌ కాలేజీ నుండి డిగ్రీ తీసుకున్నాక, పూణెలోని బాలాజా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మోడ్రన్‌ మేనేజ్‌మెంట్‌ నుండి ఎంబీయే పూర్తి చేశాను. ఏడేళ్లపాటు కార్పొరేట్‌ సెక్టార్‌లో వర్క్‌ చేశాను. లక్షల రూపాయల జీతం. కానీ, మా ఊరు వైపు నన్ను తన వైపు లాగింది. 2010లో మా గ్రామ పంచాయితీ మహిళలకు రిజర్వ్‌ చేయబడింది. అప్పుడు మా ఊరి పెద్దలు నన్ను ఎన్నికల్లో నిలబడమని అడిగారు. ఆ సమయంలో సర్పంచ్‌ని అవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. గ్రామస్తులు మా అమ్మనాన్నలను అడిగారు. ‘ఏం చేయాలనుకున్నా తన ఇష్టం, మా బలవంతం ఉండదు’ అని చెప్పారు. నాకు అప్పటి వరకు గ్రామ సభలు ఎలా జరుగుతాయి, పంచాయితీలకు నిధులు ఎలా వస్తాయో తెలియదు. ఆ విషయాలను గ్రామస్తులే చెప్పారు. ఆ విధంగా పంచాయితీ ఎన్నికల్లో నిలబడి, గెలిచాను. మా ఇంట్లో మా తాత తర్వాత నేను సర్పంచ్‌ని అయ్యాను. గ్రామపంచాయితీ నా కుటుంబం లాంటిది. నేను మీటింగులు పెట్టడం మొదలుపెట్టగానే ఏయేప్రాజెక్టుల్లో ఎలా పనిచేస్తున్నానో చెప్పేదాన్ని. ఈప్రాజెక్టుల గురించి వారు ఏమనుకుంటున్నారో అందరి అభిప్రాయాలు తెలుసుకునేదాన్ని. అలాగే, ఎంత డబ్బు ఖర్చు అవుతుందో కూడా వివరించేదాన్ని. పనులు సజావుగా అయ్యేలా అధికారులను కలిసి ఆరా తీయమని గ్రామస్తులకు  చెప్పేదాన్ని.మహిళల బృందం డిజైనర్‌ ల్యాంప్‌లు, కొవ్వొత్తులు, మసాలా దినుసులు వంటి ఉత్పత్తులు తయారు చేయడం మొదలుపెట్టారు. ఇవి మంచి ధరకు అమ్ముడు పొంవడం మొదలయ్యింది. దీంతో మహిళల జీవితం మెరుగుపడింది. రెండేళ్లలో 950 ఇళ్లకు గాను 800 మరుగుదొడ్లు నిర్మించాం. 24 గంటలూ కరెంట్‌ అందుబాటులోకి వచ్చింది..