Monday 29th of April 2024

ఫ్రూట్‌ ఫేషియల్‌: పార్లర్‌ అవసరం లేకుండా ఇంట్లోనే..

14 Dec , 2023 06:58 , IST
Article Image

బ్యూటీ టిప్స్‌: 1.రెండు స్పూన్ల క్యారెట్‌ జ్యూస్‌లో బొప్పాయి ‍జ్యూస్‌, శనగపిండి, తేనె కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. 2.యాపిల్‌ పండును చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి స్మాష్‌ చేసుకోండి. ఇందులో తేనె, రోజ్ వాటర్ కలుపుకొని ఫేస్‌ప్యాక్‌ వేసుకోండి. ఇలా తరచూ చేస్తుంటే నల్లటి మచ్చలు తొలగిపోయి చర్మం మంచి నిగారింపు సంతరించుకుంటుంది. 3.ఆరెంజ్‌ పండ్ల తొక్కలను పొడి చేసుకొని అందులో గంధం, చిటికెడు పసుపు కలిసి ముఖానికి రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే జిడ్డుతనం పోయి యవ్వనంగా తయారవుతారు. 4.చర్మ సౌందర్యానికి బొప్పాయి బెస్ట్‌ ఛాయిస్‌. మొటిమలు, మచ్చలు వంటి చర్మ వ్యాధులను తగ్గించేందుకు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. బొప్పాయి పండులో కాసిన్ని పాలు, తేనె కలపుకొని ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే చర్మం తాజాగా, బ్రైట్‌గా కనిపిస్తుంది. 5.మామిడి, ఓట్స్‌ను కలిపిన ఈ స్క్రబ్‌ ముఖం మీద మృతకణాలు, దుమ్మూధూళిని తొలగించి చర్మానికి నిగారింపునిస్తుంది. .