Monday 29th of April 2024

ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా? ఆ తప్పు అస్సలు చేయకండి

14 Dec , 2023 07:04 , IST
Article Image

శీతాకాలంలో చర్మ సమస్యలు సాధారణం. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కాలంలో  చర్మానికే కాదు.. జుట్టుకూ సమస్యల చిక్కులు తప్పవు. ముఖ్యంగా చలికాలంలో జుట్టు రాలిపోవడం కాస్త ఎక్కువగానే ఉంటుంది. శీతాకాలంలో శిరోజాలను సంరక్షించుకోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... తదితర విషయాలు తెలుసుకుందాం...శీతాకాలంలో ఉండే చల్లగాలుల వల్ల శరీరంలోనే కాదు, శిరోజాల్లో కూడా తేమ శాతం తగ్గిపోతుంది. ఫలితంగా జుట్టంతా అట్టకట్టినట్లు పొడిగా తయారవుతుంది. అంతే కాదు,  కుదుళ్ళు బలహీనపడి జుట్టు రాలిపోయే సమస్య అధికం అవుతుంది కాబట్టి చలి బారి నుంచి శిరోజాలను కూడా సంరక్షించుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం. తరచూ తలస్నానం : శీతాకాలంలో తలస్నానం మరీ ఎక్కువగా లేదా తక్కువగా చేయకూడదు. వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువసార్లు చేయడం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. హెయిర్‌ డ్రయ్యర్స్‌: శీతాకాలంలో జుట్టుకు ఉపయోగించే డ్రయర్స్, కర్లర్స్‌స్ట్రెయిటనర్స్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి. టవల్‌తో తుడుచుకుని ఆరబెట్టుకునే విధానానికే పరిమితం కావాలి. హెయిర్‌ ఆయిల్‌: చలికాలంలో శిరోజాలకు తరచు నూనె పెడితే మంచిది. ఇది జుట్టులోని తేమ శాతం ఎక్కువ సమయం నిలిచి ఉండటానికి ఉపకరిస్తుంది. అలాగే దువ్వుకోవడానికి సన్న పళ్ల దువ్వెన కాకుండా పళ్లు కాస్త దూరంగా... వెడల్పుగా ఉన్న దువ్వెన వాడటం మంచిది..