పార్లమెంట్ భద్రత వైఫల్యానికి నిరసనగా విపక్ష పార్టీలు ఆందోళన నిర్వహించాయి. పార్లమెంట్‌లో ప్రశ్నిస్తున్న ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడంపై పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద విపక్ష పార్టీల ఎంపీలు ధర్నాకు దిగారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.సస్పెండ్ అయిన ఎంపీలు పార్లమెంట్ మకర ద్వారం వద్ద నిరసన చేపట్టారు. వారిని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ కలిశారు. పార్లమెంట్ అలజడి అంశంలో మొత్తంగా 14 మంది ఎంపీలు సభ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహించాయి. దీంతో మధ్యాహ్నం 2 వరకు స్పీకర్ సభను వాయిదా వేశారు.పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. స్పీకర్ ఇచ్చిన భద్రతా నియమాలనే ప్రభుత్వం పాటించింది. ఈ అంశం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉంది. ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేస్తోందని చెప్పారు..