Monday 13th of May 2024

ఈ ట్రిక్‌ వాడారో 'క‌ర‌క‌ర‌లాడే బిస్కెట్లు' ఇక మీ సొంత‌మే!

15 Dec , 2023 03:19 , IST
Article Image

'మ‌నం తినేవాటిలో అనేక‌ పదార్థాలుంటాయి. అందులో మెత్త‌వైనా ఉండొచ్చు, గ‌ట్టివిగానూ ఉండొచ్చు. అయితే అప్ప‌డాలు, బిస్కెట్ల‌లో చాలామ‌టుకు క‌ర‌క‌ర‌లాడే వాటినే ఇష్ట‌ప‌డుతుంటాం. బిస్కెట్లను తీసుకున్న‌ట్ల‌యితే వీటిలో కూడా చాలా ర‌కాలుంటాయి. మ‌నకు ఇష్టమైన‌టువంటి కొన్ని ర‌కాల బిస్కెట్ల‌లో ఈ క‌ర‌క‌ర‌లాడే బిస్కెట్లు తోడైతే ఆ రుచి, అనుభూతియే వేరు. మ‌రెందుకు ఆల‌స్యం వాటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం!' కరకరలాడాలంటే.. బిస్కెట్లు మెత్తగా అవ్వకుండా కరకరలాడాలంటే ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి! • ప్లాస్టిక్, అల్యుమినియం డబ్బాలు, గాజు పాత్రల్లో బిస్కెట్లు, కుకీలను నిల్వచేయాలి. • గాలి చొరబడకుండా పెడితే ఎక్కువరోజులపాటు క్రిస్పీగా ఉంటాయి. • డబ్బాల్లో నిల్వచేసేటప్పుడు అడుగు భాగంలో రెండుమూడు వరుసల్లో టిష్యుపేపర్లు వేసి తరువాత బిస్కెట్లు పెట్టాలి. • బిస్కెట్లపైన మరో రెండు వరుసల్లో టిష్యూపేపర్లు వేసి పైన బిస్కెట్లు పెట్టాలి. • ఇలా నిండుగా పెట్టి గాలిచొరబడకుండా మూత పెట్టాలి.  • గాలి చొరబడని డబ్బాలు, జిప్‌లాక్‌ పౌచ్‌లను రిఫ్రిజిరేటర్‌లో పెడితే మరిన్ని రోజులు బిస్కెట్లు తాజాగా ఉంటాయి. .