Tuesday 14th of May 2024

ఎర్ర బంగారం ఇక ఎంతైనా ఎగుమతి!

15 Dec , 2023 03:50 , IST
Article Image

ఎర్ర చందనం.. ప్రపంచంలో కేవలం మన దేశంలో మాత్రమే ఉన్న అత్యంత అరుదైన, అత్యంత ఖరీదైన జాతి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో విస్తరించిన తూర్పు కనుమల్లోని అడవుల్లో సహజ సిద్ధంగా ఎర్ర చందనం అనాదిగా పెరుగుతోంది. దీనితోపాటు, కొందరు రైతులు వర్షాధార భూముల్లో ఎర్రచందనం తోటలను చాలా ఏళ్లుగా సాగు చేస్తున్నారు. అంతరించిపోయే ప్రమాదం అంచుల్లో ఉన్న అరుదైన జాతి కావటంతో ఎర్రచందనం కలప ఎగుమతిపై 19 ఏళ్లుగా అంతర్జాతీయంగా పరిమితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాల కృషి మేరకు ఎర్రచందనం ఎగుమతులపై పరిమితులు ఇటీవలే తొలగిపోయాయి. ఇక ఎంతయినా రైతులు ఎగుమతి చేయొచ్చు. మంచి ధర వచ్చే వరకు నిల్వ చేసుకొని మరీ ఎగుమతి చేసుకోవచ్చు. మెట్ట ప్రాంతాల్లో ఎర్రచందనం సాగు పుంజుకునేందుకు దోహదపడనున్న ఈ తాజా పరిణామంపై ప్రత్యేక కథనం.   అంతర్జాతీయంగా ఆర్థికంగా ముఖ్యమైన చెట్ల జాతుల్లో ఎర్రచందనం ఒకటి. ఎర్రచందనం చేవ కర్రకు ఔషధ గుణాలు ఉన్నాయి. మన దేశంలోని తూర్పు కనుమలు విస్తరించిన దక్షిణ ప్రాంతంలో సహజ అడువుల్లో విస్తారంగా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. రైతులు కూడా తమ భూముల్లో సాగు చేస్తున్నారు. సుదీర్ఘకాలం పెంచాల్సి రావటం, చెట్లు నరకడానికి, అమ్మకానికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉండటం వంటి పరిమితులు ఉన్నప్పటికీ.. అంతర్జాతీయంగా గిరాకీ, అధిక ధర, మార్కెట్‌ డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవటం వల్ల ఎర్రచందనం సాగుకు కొంత మంది రైతులు ఆసక్తి చూపుతూ వచ్చారు. ఎగుమతిపై పరిమితులు ఇటీవల రద్దయిన నేపథ్యంలో ఎర్రచందనం సాగు మరింత పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నది నిపుణుల మాట. అంతర్జాతీయంగా ఆర్థికంగా ముఖ్యమైన చెట్ల జాతుల్లో ఎర్రచందనం ఒకటి. ఎర్రచందనం చేవ కర్రకు ఔషధ గుణాలు ఉన్నాయి. మన దేశంలోని తూర్పు కనుమలు విస్తరించిన దక్షిణ ప్రాంతంలో సహజ అడువుల్లో విస్తారంగా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. రైతులు కూడా తమ భూముల్లో సాగు చేస్తున్నారు. సుదీర్ఘకాలం పెంచాల్సి రావటం, చెట్లు నరకడానికి, అమ్మకానికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉండటం వంటి పరిమితులు ఉన్నప్పటికీ.. అంతర్జాతీయంగా గిరాకీ, అధిక ధర, మార్కెట్‌ డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవటం వల్ల ఎర్రచందనం సాగుకు కొంత మంది రైతులు ఆసక్తి చూపుతూ వచ్చారు. ఎగుమతిపై పరిమితులు ఇటీవల రద్దయిన నేపథ్యంలో ఎర్రచందనం సాగు మరింత పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నది నిపుణుల మాట. ఎర్రచందనం చెట్టు కాండం మధ్యలో పెరిగే ఎర్రటి చేవ కర్రను వస్త్రాలు, ఆహారం, ఔషధాల్లో సేంద్రియ రంగు కోసం వాడుతున్నారు. ఖరీదైన ఫర్నీచర్, బొమ్మలు, సంగీత వాయిద్యాల తయారీకి వాడుతున్నారు. షుగర్, చర్మవ్యాధులకు ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతున్నది. జపాన్, చైనా, ఐరోపా దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతోంది. అడవుల్లోని ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు గతంలో విచక్షణారహితంగా నరికివేసిన కారణంగా ఈ వృక్ష జాతి అంతరించిపోయే ముప్పును ఎదుర్కొనే దశకు చేరింది. అందువల్ల ఎర్రచందనం జాతిని అంతరించిపోకుండా పరిరక్షించడానికి ప్రత్యేక చర్యలు అవసరమయ్యాయి..