Tuesday 14th of May 2024

ఈ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే..

19 Dec , 2023 11:18 , IST
Article Image

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు  మార్గశిర మాసం, తిథి: శు.పంచమి రా.8.48 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: శ్రవణం ఉ.8.07 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: ప.11.52 నుండి 1.20 వరకు, దుర్ముహూర్తం: ప.4.01 నుండి 4.49 వరకు, అమృతఘడియలు: రా.8.50 నుండి 10.20 వరకు, ధనుర్మాసం ప్రారంభం. సూర్యోదయం : 6.27 సూర్యాస్తమయం : 5.25 రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు మేషం: మీ ఆశయాలు నెరవేరే సమయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. వృషభం: దూరప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి. ధనవ్యయం. మిథునం: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. మానసిక అశాంతి. అనారోగ్యం. కర్కాటకం: సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. కాంట్రాక్టులు పొందుతారు. యత్నకార్యసిద్ధి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. సింహం:పరిచయాలు పెరుగుతాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కన్య:వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. అప్పులు చేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. తుల: ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. సోదరులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే. వృశ్చికం: పనులు విజయవంతంగా పూర్తి. సోదరుల నుంచి ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.  ధనుస్సు: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. మకరం: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. అందరిలోనూ గుర్తింపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు. ఆలయాల సందర్శనం.  కుంభం: కుటుంబంలో చికాకులు. పనులు ముందుకు సాగవు.  ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. ఆరోగ్య సమస్యలు.   మీనం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనుకోని «విధంగా ధనలాభం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు..