Tuesday 14th of May 2024

రాశిఫలాలు: ఈ రాశివారు మిత్రులతో ఆనందంగా గడుపుతారు

19 Dec , 2023 11:30 , IST
Article Image

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: శు.సప్తమి సా.4.02 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: పూర్వాభాధ్ర రా.3.12 వరకు, తదుపరి ఉత్తరాభాధ్ర, వర్జ్యం: ఉ.10.47 నుండి 12.17 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.37 నుండి 9.25 వరకు, తదుపరి రా.10.39 నుండి 11.31 వరకు, అమృతఘడియలు: రా.7.46 నుండి 9.13 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 6.28, సూర్యాస్తమయం: 5.26.  మేషం... పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు సర్దుకుంటాయి.  వృషభం...వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతస్థితి. కొత్త వ్యక్తుల పరిచయం. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. మిథునం....కుటుంబసమస్యలు. వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం.  కర్కాటకం... ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు.  సింహం.... ఉద్యోగయత్నాలు సానుకూలం. వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి.  ఉద్యోగాలలో కొత్త ఆశలు. కన్య....దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.  తుల....బంధువిరోధాలు. ప్రయత్నాలు ముందుకు సాగవు. ఖర్చులు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.  వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యసమస్యలు. వృశ్చికం.... పనులలో ఆటంకాలు. వృథా ఖర్చులు. అదనపు బాధ్యతలు. సోదరులు,మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.  ధనుస్సు.... కొత్త పనులు చేపడతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.  మకరం.... కాంట్రాక్టులు చేజారతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబసభ్యులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. కుంభం.... కొత్త పనులు ప్రారంభిస్తారు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి. మీనం.... కొన్ని పనులు వాయిదా. మిత్రులతో అకారణ వైరం. కుటుంబసమస్యలు. అనారోగ్యం. ఉద్యోగులకు చిక్కులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి..